top of page
MediaFx

నా భార్యను చూసి ఏడ్చేశా.. ఎమోషనల్ అయిన రాజమౌళి


రాజమౌళి రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీలో చాలా విషయాలను పంచుకున్నాడు రాజమౌళి. అలాగే మగధీర సినిమాకు సంబందించిన విషయాలను తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ.. మగధీర షూటింగ్ సమయంలో మాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. మేము ఒక ఏరియాలో డ్రైవ్ చేస్తూ వస్తుంటే అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అయింది. మా వాళ్లందరికీ అందరికి గాయాలు అయ్యాయి. నా భార్య రమకి బాగా దెబ్బలు తగిలాయి. నడుము కింద స్పర్శ కూడా పోయింది. పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు. దాంతో మాకు ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.వెంటనే తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేశాను. అలా డాక్టర్స్ కు ఫోన్ చేస్తూ నా భార్యని చూస్తూ ఏడ్చేసాను అని తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయ్యింది రాజమౌళి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.



bottom of page