దర్శకధీరుడు రాజమౌళి తన కొత్త సినిమాను ప్రకటించాడు. అయితే ఈ కొత్త సినిమాకు ఆయన దర్శకుడు కాదు. కేవలం సమర్పకుడు. తన కొడుకుని ఈ సినిమాతో నిర్మాతగా మార్చాడు. రాజమౌళి సమర్పణలో ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండియన్ సినిమా హిస్టరీ మీద రాజమౌళి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. మేడ్ ఇన్ ఇండియా అంటూ ఈ సినిమా రాబోతోందంటూ రాజమౌళి ట్వీట్ వేశాడు. “ఫస్ట్ కథ,కథనం విన్నప్పుడే నేను కదిలిపోయాను.. ఎంతో ఎమోషనల్‌కు లోనయ్యాను.. అసలు బయోపిక్ అనేది చేయడమే చాలా కష్టమైన పని.. అలాంటిది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీసి మెప్పించడం అంటే అది పెద్ద సవాలే.. మా వాళ్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు.. మేడ్ ఇన్ ఇండియాను ఎంతో సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నాను” అని రాజమౌళి ట్వీట్ వేశాడు .దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో రూపొందుతున్న 'మేడ్ ఇన్ ఇండియా' . దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? భారతీయ సినిమా పితామహుడిగా (ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా) చరిత్రకు ఎక్కిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్ ఇది.మన దేశంలో తొలి ఫీచర్ ఫిల్మ్ 'రాజా హరిశ్చంద్ర' తీసిన ఘనత దాదా సాహేబ్ ఫాల్కే సొంతం. 1913లో ఆ సినిమా వచ్చింది. ఇండియాలో సినిమా ఎలా పుట్టింది? ఫాల్కే ఏం చేశారు? భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఏమిటి? వంటి అంశాలతో పాటు ఆయన జీవితాన్ని 'మేడ్ ఇన్ ఇండియా'లో చూపించనున్నట్లు తెలిసింది.