top of page
MediaFx

ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..


దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఇటీవల జరిగింది. ఈసారి రాజమౌళి ఈ ప్రమోషన్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాహుబలి సినిమా గురించి.. ఆ సినిమా ప్రమోషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మాట్లాడుతూ..’ బాహుబలి ‘ సినిమా ప్రమోషన్‌కు ఎలాంటి డబ్బులు ఖర్చుకాలేదు అని చెప్పి షాక్ ఇచ్చారు జక్కన్న. ఇది విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.  రాజమౌళి సినిమా అంటే మినిమం ఉంటుంది. భారీ బడ్జెట్ , స్టార్ నటీనటులు, సెట్స్ ఇలా అన్ని గ్రాండ్ గా ఉంటాయి.

రాజమౌళి సినిమా  మేకింగ్‌ తో పాటు ప్రమోషన్‌ పై కూడా దృష్టి పెడతాడు. విపరీతంగా డబ్బు వెచ్చించి తన సినిమాను ప్రచారం చేస్తుంటారు. అందుకు ‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమా మంచి ఉదాహరణ. అంతే కాదు ఈ సినిమాను ఆస్కార్ రేసులో నిలబెట్టేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు రాజమౌళి. అయితే ‘బాహుబలి’కి మాత్రమే మౌత్ పబ్లిసిటీ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

“నేను నా ప్రాజెక్ట్‌ల నుండి ఎక్కువ ఆశించను, చాలా తక్కువ ఆశించను. నా సినిమా రిలీజ్ అవుతుందంటే అందరూ దాని కోసం ఎదురుచూస్తున్నారని కూడా నేను అనుకోను. నేను ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉండటానికి ప్రయత్నిస్తాను. కొత్త ప్రేక్షకులను ఎలా తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది’ అని అన్నారు రాజమౌళి. ‘‘బాహుబలి సినిమా ప్రమోషన్‌ కోసం మేం డబ్బులు పెట్టలేదు. ఏ పేపర్ లేదా వెబ్‌సైట్ కోసం డబ్బు ఇవ్వలేదు. కానీ, మేము చాలా హోంవర్క్ చేసాము. మేము చాలా వీడియోలు చేసాము. చాలా పోస్టర్లు సిద్ధం చేశాం. పాత్రలను పరిచయం చేశాం. మేం మేకింగ్ వీడియో షేర్ చేశాం. దీంతో ఆటోమేటిక్‌గా ప్రచారం వచ్చింది. మేం మా మైండ్ కు ఖర్చుపెట్టాం’ అని అన్నారు రాజమౌళి. ఒక్కో సినిమా ఒక్కో విధంగా ఉంటుంది. మేము ప్రతి సినిమా మార్కెటింగ్‌పై దృష్టి పెడతాము. దీంతో పాటు కొత్త ప్రేక్షకులను ఎలా తీసుకురావాలో ఆలోచిస్తాం’ అన్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మే 10న రీ-రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా రీ  దీంతో పాటు మహేష్ బాబు సినిమా పనులపై కూడా శ్రద్ధ పెట్టాడు.


bottom of page