top of page
Suresh D

సొంతగడ్డపై రాజస్థాన్ 'రాయల్' విక్టరీ

ఐపీఎల్ 2024లో కొనసాగుతున్న కొత్త సంప్రదాయాన్ని రాజస్థాన్ రాయల్స్ కొనసాగించింది. ఈ సీజన్‌లో గురువారం నాటి మ్యాచుతో కలిపి మొత్తం 9 మ్యాచులు జరిగాయి. అందులో అన్నింట్లోనూ హోం గ్రౌండ్‌లో మ్యాచులు ఆడిన జట్లే విజయం సాధించాయి. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ఆతిథ్య జైపూర్.. విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచులో లక్నోను ఓడించిన రాజస్థాన్.. ఢిల్లీపై విజయంతో వరుసగా రెండు మ్యాచులో గెలుపొందింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో మ్యాచులో ఓడిపోయింది. తొలి మ్యాచులో ఆ జట్టు పంజాబ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 45 బంతుల్లో 84 పరుగులు చేసి రాజస్థాన్  రాయల్ జట్టుకు భారీ స్కోరు అందించాడు

bottom of page