ఏపీలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.
ఏపీలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. వచ్చే సోమవారం ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసి పరామర్శించనున్నారని సమాచారం. కాగా, నిన్న నారా భువనేశ్వరి ములాఖత్ ను నిరాకరించిన విషయం తెలిసిందే.ఎప్పటి నుంచో చంద్రబాబు, రజనీకాంత్ మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది. గతంలో చంద్రబాబు పాలనను ప్రశంసించిన రజనీపై వైసీపీ నేతలు విమర్శల దాడి చేశారు. చంద్రబాబు అరెస్టయిన తర్వాత కూడా రజనీ స్పందించారు. నారా లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు పోరాట యోధుడని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును రజనీకాంత్ కలవనుండటం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించే అవకాశం ఉంది. 🎥🎞️