రజనీకాంత్ నటించిన ‘ జైలర్ ‘ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియో రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటాయి. సినిమా విజయంతో ఆనందంలో తేలిపోతున్న నిర్మాత కళానిధిమారన్ హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌లకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. కానీ ‘జైలర్’ సినిమాలో విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ నటుడు వినాయకన్ పారితోషికం చాలా తక్కువ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 🎥🎞️
‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రను అద్భుతంగా హ్యాండిల్ చేశారు వినాయకన్. వినాయకన్ చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. అయితే జైలర్ సినిమా కోసం వినయగన్ కేవలం 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వినాయకన్ నిర్మాతలు ఈ వార్త వినకపోతే చాలు అని అన్నారు నాకు 35 లక్షలు ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదు. ఈ తప్పుడు వార్తలను కొందరు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు నేను అడిగినంత ఇచ్చారు. సెట్‌లో నాకు రాయల్ ట్రీట్‌మెంట్ కూడా ఇచ్చారు’’ అని అన్నారు.నేను సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ‘జైలర్’ నాకు చాలా పెద్ద అవకాశం. అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను.. ‘జైలర్’ సినిమాలో పాత్ర కారణంగా ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే అదంతా మా చేతుల్లో లేదు’’ అని వినాయకన్ అన్నారు.🎥🎞️