top of page
Suresh D

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో రజనీకాంత్ భేటీ..🎥🌟

సూపర్‌స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అన్వర్ ఇబ్రహీం తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల కష్టాలు, ఆ సమయంలో తాను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారన్నారు. భవిష్యత్తులో ఆయన నటించే సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని తాను కోరినట్లు వెల్లడించారు. రజనీకాంత్ తాను ఎంచుకునే ప్రతి రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.🎥🌟


bottom of page