సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమా రికార్డులు తిరగరాసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఆరువందల కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇక నిర్మాతకు వచ్చిన భారీ లాభాలతో హీరో రజినీకాంత్‌కు, దర్శకుడు నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఇంత భారీ సక్సెస్ అయినందుకు సీక్వెల్ మీద కూడా ఫోకస్ పెడుతోంది. జైలర్ సీక్వెల్ తీస్తారనే చర్చలు ఎప్పటి నుంచో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ అప్డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.జైలర్ 2 సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. హుకుం అనే టైటిల్‌ను పెట్టాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఈ ఏడాదిలోనే సినిమా షూట్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదికి విడుదల చేయాలని చూస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని నెల్సన్ స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. జైలర్ 2 అప్డేట్ అంటూ తమిళ మీడియా, సోషల్ మీడియాలో ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి.
మరి ఈ జైలర్ 2 టైటిల్‌గా హుకుమ్ అనే దాంట్లో ఎంత నిజం ఉన్నది మేకర్లు చెప్పాల్సి ఉంది. ఇక ఈ జైలర్‌తో సన్ పిక్చర్స్‌కు భారీ లాభాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక ఈ మూవీలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ వేసిన స్పెషల్ రోల్స్ అదిరిపోయాయి. మరి ఈ సీక్వెల్‌లో వారు ఫుల్ లెంగ్త్‌లో కనిపిస్తారా? లేదా? అన్నది చూడాలి.🎥✨