top of page
Shiva YT

రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి తెలుగు మూవీ రివ్యూ

చిత్రం: రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

బ్యానర్ : వెంకట శివ సాయి ఫిల్మ్స్

నటీ నటులు: రవితేజ నున్న, నేహా జూరెల్, నాగినీడు, ప్రమోదిని, యోగి ఖాత్రి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ఆ దూరి దుర్గ నాగ మోహన్ తదితరులు

సంగీత దర్శకుడు: రోషన్ సాలుర్

సినిమాటోగ్రాఫర్: మురళీకృష్ణ వర్మన్

ఎడిటర్ : కిషోర్ తిరుమల

రచన: సత్య రాజ్ కుంపట్ల

నిర్మాత : ముత్యాల రామదాసు

దర్శకత్వం: సత్య రాజ్ కుంపట్ల

తన్విక & మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు నిర్మించిన చిత్రం రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

పల్లెటూరులో జరిగే కథ. కర్ణ(రవితేజ నున్న) ఊరిలో జులై గా తిరిగే కుర్రాడు. ఊర్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయుడు గారి అబ్బాయి. అదే ఊర్లో రాజు గారి అమ్మాయి అను(నేహా జురెల్). అనుకోని సందర్భంలో అనుని చూసి కర్ణ ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య మంచి సంబంధం బలపడుతున్న సందర్భంలో హీరోయిన్ తో హీరో ఫిజికల్ గా దగ్గర అవ్వాలి అనుకుంటాడు. దానికి అను తిరస్కరిస్తుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు అను శవమై కనిపిస్తుంది. ఈ మర్డర్ కర్ణ మీదకు వస్తుంది. కర్ణ తండ్రి నాగినీడు పరపతితో బయటకు వచ్చి మర్డర్ మిస్టరీని ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. అనును చంపింది ఎవరు? తన మరణానికి కర్ణ స్నేహితులకు ఏంటి సంబంధం? కర్ణ తండ్రి నాగినీడు పాత్ర ఏంటి? ఇంతకీ అను చనిపోయిందా లేదా చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. సినిమా ఫస్టాఫ్ కర్ణ అను మధ్య స్నేహం ప్రేమ అనే రిలేషన్స్ తో ఆధ్యాంతం ఆహ్లాదకరంగా సాగుతోంది. ఎప్పుడైతే అను విగతజీవిగా లభ్యమవుతుందో సినిమాలో అసలైన ప్లాట్ మొదలవుతుంది.

ఇక సెకండాఫ్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా కథ సాగుతోంది. ఆధ్యాంతం ప్రేక్షకుడిని కట్టుపడేసేలా ప్రతి సన్నివేశం అద్భుతంగా రాసుకున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఊహించని రహస్యాలు, మలుపులు ప్రేక్షకుడిని కట్టి పడేసేలా ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది. ఈ సినిమాలో బీజిఎం అద్భుతంగా వర్కౌట్ అయింది. సినిమా చివరి నిమిషం వరకు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంది. ప్రధమార్ధంలోని కొన్ని లవ్ సీన్స్ రొటీన్ గా అనిపించినా.. దేతియార్థం మొత్తం అత్యంత ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దారు. యాక్షన్ త్రిల్లర్ డ్రామాలు కోరుకునే ప్రతి ప్రేక్షకునికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది.

నటీనటులు:

ఈ చిత్రంలో హీరో రవితేజ నున్న చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. పక్కింటి కుర్రాడులా తన నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాడు. హీరోయిన్గా చేసిన నేహా జురెల్ ఆకట్టుకుంది. తన నటించిన అన్ని సన్నివేశంలో ప్రేక్షకుడి చూపు తన నుంచి తిప్పుకోకుండా నటన కనబరిచింది. క్యారెక్టర్ ఆర్టిస్టులు నాగినీడు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ప్రమోదిని తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు:

ముఖ్యంగా దర్శకుడు సత్యం రాజ్ కుంపట్ల అద్భుతమైన కథతో, అత్యద్భుతమైన మలుపులతో చిత్రాన్ని ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు. థ్రిల్లర్ పాయింట్ తో చివరి వరకు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టిన ప్రతిభ డైరెక్టర్ ది. ఈ సినిమాతో అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. కచ్చితంగా సత్యం రాజ్ కుంపట్ల నుంచి వచ్చే తదుపరి చిత్తం కోసం ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూసేలా ఆయన టేకింగ్ ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డిఓపి మురళీకృష్ణ వర్మన్ తన ప్రతిభతో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా తీర్చి దిద్దాడు. సంగీత దర్శకుడు రోషన్ సాలూరు ప్రాణం పెట్టే పని చేశారు సినిమాకు సంగీతం వెన్నుముకగా నిలిచింది అంటే దానికి కారణం రోషన్ సాలూరి ప్రతిభ. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రతి సన్నివేశాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు.

ప్లస్ పాయింట్లు:

కథ

కథనం

మలుపులు

యాక్టింగ్

దర్శకత్వం

సంగీతం

మైనస్ పాయింట్లు

మైనస్ పాయింట్స్: లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడక్కడ కొంత బోర్ ఉందని చెప్పొచ్చు


bottom of page