top of page
MediaFx

ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం..


రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం

పంచాంగం ప్రకారం ఆగస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:26 నుండి సాయంత్రం 6:25 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో రాఖీని కట్టడం ద్వారా సోదరులు శ్రేయస్సు, అదృష్టంతో పాటు దీర్ఘాయువు అనుగ్రహాన్ని పొందుతారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది.

మొదటి రాఖీని దేవుడికి సమర్పించండి

రాఖీ పండగ రోజున రాఖీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ రోజున పూజ ప్లేట్‌లో రాఖీని ఉంచండి. ఈ పవిత్రమైన రోజున దేవునికి మొదటి రాఖీని సమర్పించండి. ఆ తర్వాతే సోదరుడికి రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నదమ్ములు దేవుడి ఆశీస్సులు పొందుతారు. అంతేకాదు రాఖీ రోజున సోదరుడికి హారతిని ఇచ్చి.. నుదుట తిలకం దిద్ది… అక్షతలు వేసి అనంతరం రాఖీని కట్టండి.

సోదరసోదరీమణుల బంధంలో మాధుర్యం

రాఖీ పండగ రోజున సోదరీమణులు దీపం వెలిగించి సోదరునుకి హారతి ఇవ్వండి. హిందూ మతంలో దీపం సానుకూలత, కాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీంతో సోదరసోదరీమణుల మధ్య ప్రేమ జీవితాంతం ఉంటుంది. రాఖీ పండగ శుభ సందర్భంగా తప్పనిసరిగా సోదరుడికి స్వీట్ అందించండి. సోదరులకు కుంకుమ దిద్ది.. రక్షా సూత్రం కట్టిన తర్వాత మిఠాయి తినిపించండి. ఇలా చేయడం వల్ల సోదరసోదరీమణుల మధ్య అనుబంధంలో మాధుర్యం జీవితాంతం నిలిచిపోతుంది.

bottom of page