top of page
Balaparasuram

ప్రతి పాట మెప్పిస్తుంది 🎬... ప్రతి డైలాగ్ పేలుతుంది 🗣️: హీరో రామ్

రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో 'స్కంద' సినిమా రూపొందింది 🎥. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల నటించింది 👸.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది 📅. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . తాజాగా సుమ చేసిన ఇంటర్వ్యూలో రామ్ - శ్రీలీల మాట్లాడారు. " ఈ సినిమా మాస్ యాక్షన్ జోనర్లో కనిపించినప్పటికీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడుస్తుంది . గౌతమి .. ఇంద్రజ .. రాజా వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, ఎక్కడా మీటర్ దాటకుండా ఈ కథ నడుస్తూ ఉంటుంది . ప్రతి డైలాగ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది" అని రామ్ అన్నాడు.తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 3 పాటలకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గొప్పగా కొరియోగ్రఫీ చేశాడు. ఫైట్స్ మాత్రమే కాదు సాంగ్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి" అని రామ్ చెప్పాడు. ఇక రామ్ తో సమానంగా స్టెప్పులు వేయడానికి తాను చాలా కష్టపడ్డాననీ, చాలా ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది" అని శ్రీలీల చెప్పింది.


bottom of page