రామ్ 'స్కంద' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..🌟🎉
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
రామ్-బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమా 'స్కంద' . యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు మేకర్స్. ఇంగ్లీష్ వోకల్స్‌తో నీ చుట్టూ చుట్టూ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. థమన్ స్వర పరిచిన ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ఆగస్టు 3న రిలీజ్ కాబోతుంది.🎬🍿