top of page
Suresh D

4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ‘రామబాణం’..🎥🎞️

గోపీచంద్‌ రామబాణానికి ఓటీటీ మోక్షం కలిగింది. సుమారు 4 నెలల తర్వాత ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్‌ హయతీ హీరోయిన్‌గా నటించింది.

గోపీచంద్‌ రామబాణానికి ఓటీటీ మోక్షం కలిగింది. సుమారు 4 నెలల తర్వాత ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్‌ హయతీ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్‌ అన్నయ్యగా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో మెప్పించారు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన రామబాణం తీర థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడింది. రోటీన్‌ కథ కావడంతో ఆడియెన్స్‌ పెదవి విరిచారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. అయితే గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఫ్యాన్స్‌ని మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని రామబాణం త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని భావించారు చాలామంది. అయితే నాలుగు నెలల వరకు ఆ ముహూర్తం కుదరలేదు. రామబాణం మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌ కొనుగోలు చేసింది. గురువారం (సెప్టెంబర్‌ 14) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం స్ట్రీమింగ్‌ అవుతోంది.


bottom of page