top of page
MediaFx

రామాయణ మేకర్స్‌కు నోటీసులిచ్చిన అల్లు అరవింద్..


ఎన్నో అంచనాల మధ్య.. మరెన్నో ఏర్పాట్ల మధ్య.. రీసెంట్‌గా మొదలైన రామాయణ సినిమాకు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మూవీ టీంకు అల్లు అరవింద్ నోటీసులివ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని అంటున్నారు అరవింద్‌, మధు వంతెన. మొదట ఈ సినిమాను నిర్మించేందుకు నితీష్ తివారీతో తాము ఒప్పందం చేసుకున్నట్టు వారు చెప్పారు. కానీ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ.. ప్రైమ్‌ ఫోకస్ టెక్నాలజీస్‌కు ప్రొడక్షన్ బాధ్యతలు ఇచ్చారన్నారు. కాపీరైట్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. ప్రొడక్షన్ కంపెనీకి నోటీసులు పంపారు.


bottom of page