ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ లో రంభ ఒకరు. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది రంభ. అందంతో పాటు నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంది రంభ. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది.. కానీ ఒక్క హీరో మాత్రం రంభ నటించలేదు.
తెలుగులో దాదాపు టాప్ హీరోలతో జోడీ కట్టింది ఈ బ్యూటీ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సరసన రంభ నటించింది. కానీ అక్కినేని నాగార్జున సరసన మాత్రం రంభ నటించలేదు. అందుకు కారణం ఈ ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ అని తెలుస్తోంది. అప్పట్లో కింగ్ నాగార్జున పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్ ఇంట్రెస్ట్ చూపించే వారు. రమ్యకృష్ణ, సౌందర్య, టబు, మీనా ఇలా చాలా మంది నాగార్జున తో నటించడానికి క్యూ కట్టేవారు. కానీ రంభ మాత్రం నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఆమె నాగ్ తో సినిమా చేయలేదట. ఇంతకు రంభకు నాగ్ కు మద్య గొడవ ఏంటంటే.. నాగార్జున కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ సినిమా ఒకటి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించారు. నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా చేశారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్లేస్ లో ముందుగా దర్శకుడు రంభను అనుకున్నారట. ఆమెను కన్ఫర్మ్ చేసి డేట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్ణ హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో రంభను తొలగించి రమ్యకృష్ణను తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే భారీగా కలెక్ట్ చేసింది. అయితే తనను రిజక్ట్ చేసినందుకు రంభ నాగ్ పై కోపం పెంచుకుందట. అందుకే ఆయన పక్కన నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆమె చేయలేదట.. అయితే ఈవీవీ సత్యనారాయణ కోరిక మేరకు ఈ సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది రంభ. తనను పరిచయం చేసిన దర్శకుడి మాట కోసం పాటలో కనిపించిందట రంభ.