గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్ తో “గేమ్ చేంజర్” అనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా అనంతరం చరణ్ తన కెరీర్ 16వ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తో చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా విషయంలో అయితే చరణ్ సూపర్ కాన్ఫిడెన్స్ లో ఉండగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.మరి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ చిత్రానికి రెహమాన్ ఇప్పుడు ఆల్రెడీ ఓ సాంగ్ ని కంపోజ్ చేయడం అది ఓకే కూడా అయిపోవడం జరిగిందని తెలుస్తుంది. అంతే కాకుండా మిగతా మ్యూజికల్ పనులు కూడా ఈ చిత్రానికి ఇప్పుడు జరుగుతున్నాయి అని టాక్. దీనితో అయితే మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి.🎥🎞️