'గేమ్ ఛేంజర్' సినిమాకు మరోసారి లీకుల బెడద తగిలింది. ఇంటి దొంగలు ఎవరో లీకులకు కారణమని చిత్రసీమ వర్గాలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి, విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగినప్పుడు జనాలను కంట్రోల్ చేయడం, వాళ్ళ చేతుల్లో మొబైల్స్ లేకుండా చూడటం కష్టం కనుక ఆ షూటింగ్ ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఈసారి అలా కాదు. ఏకంగా ఓ సాంగ్ లీక్ అయ్యింది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ , స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘'గేమ్‌ఛేంజర్' . దిల్‌రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ లీకైనట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఈ మూవీ మ్యూజికల్ అప్ డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. ఆఫీషియల్ అనౌన్స్ రాకముందే పాట లీకవడంతో రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సాంగ్ బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 🎥🎞️