top of page
MediaFx

'రామ్‌చరణ్‌-ఉపాసన అలాంటోళ్లు' - క్లీంకార కేర్‌ టేకర్‌ లలిత


రామ్‌చరణ్‌, సతీమణి ఉపాసన మంచి మనసు ఉన్నవారని క్లీంకార కేర్‌ టేకర్‌ లలిత అన్నారు. పాప విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉంటారని, చాలా చక్కగా చూసుకుంటారని చెప్పారు. "అంబానీ ఫ్యామిలీతో పాటు చాలా మంది స్టార్‌ కిడ్స్‌కు నానీ/ఆయాగా పని చేశాను. ప్రతిఒక్కరూ నన్నెంతో బాగా చూసుకున్నారు. గొప్పమనసుతో తమ ఫ్యామిలీలోకి స్వాగతించారు. ప్రస్తుతం చరణ్‌-ఉపాసన ముద్దుల కుమార్తె క్లీంకారకు ఆయాగా పని చేస్తున్నాను. ముంబయికి ఇక్కడికి ఉన్న ఒకే ఒక్క తేడా ఆహార పద్ధతులు. ఎందుకంటే కొణిదెల ఫ్యామిలీ దక్షిణాదికి చెందినది. నేను రెస్ట్​ తీసుకునేటప్పుడు పాపను ఉపాసన చూసుకుంటారు. ఆమె ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది. బేబీని ఎత్తుకో, జాగ్రత్తగా చూసుకో అని బలవంతం చేయరు. నన్ను తమ ఫ్యామిలీ మెంబర్​గా చూస్తారు" అని లలిత చెప్పుకొచ్చింది.

bottom of page