top of page

గంజాయితో పట్టుబడ్డ రంజీ మాజీ క్రికెట్ ప్లేయర్ 🏏🍁

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారపు పేటకి చెందిన నాగరాజు కడు పేదరికంలో పుట్టినప్పటికీ స్వసక్తితో అంచలంచలుగా రంజి క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అయితే దానిని నిలుపుకోలేక పోయాడు. అత్యాశకు పోయి మోసాలకు పాల్పడుతూ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోయాడు.

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారపు పేటకి చెందిన నాగరాజు కడు పేదరికంలో పుట్టినప్పటికీ స్వసక్తితో అంచలంచలుగా రంజి క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అయితే దానిని నిలుపుకోలేక పోయాడు. అత్యాశకు పోయి మోసాలకు పాల్పడుతూ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోయాడు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం లోని సీపన్నాయుడు పేట జాతీయ రహదారి పక్కన బుడుమూరు నాగరాజును గoజాయితో పట్టుకున్నారు శ్రీకాకుళం టూ టౌన్ పోలిసులు. 🚓 ఇతని నుండి రెండు బ్యాగులతో 23 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా లోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలిసుల విచారణలో చెప్పాడు. 🚓 దీంతో ముచ్చటగా మరోసారి కటకటాల పాలయ్యాడు నాగరాజు. నాగరాజుపై రెండు తెలుగు రాష్ట్రాలలో 30 వరకు కేసులు ఉన్నాయి. అందులో 25 వరకు చీటింగ్ కేసులు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ఓఎస్‌డీ నీ అని… తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏ నీ అనీ… దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ కాల్స్ చేసి బెదిరించి అక్రమ వసూలు చేసాడు. ప్రముఖుల పేర్లు చెప్పి వరుస మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు నాగరాజు.మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ పేరు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ లు చేసి వర్థమాన రంజీ క్రికెటర్ నాగరాజుకి స్పాన్సర్‌ చేయాలని పెద్ద మొత్తంలో డ్డబు ను తన బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకుని మోసాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదులతో పలుమార్లు కాటకటాల పాలయ్యాడు. 📝


 
 
bottom of page