top of page
Suresh D

రజినీ-లోకేశ్ సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్..?

సూపర్ స్టార్ రజనీకాంత్- దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ టైటిల్ రివీల్ కూడా ఈ నెలలోనే ఉన్నట్లు ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్‌పై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ మాఫియా డాన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 

తాజా సమాచారం ప్రకారం.. 'తలైవర్ 171'లో కింగ్ ఖాన్ షారుక్‌కి లోకేష్ కనగరాజ్ ఒక ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ ఆఫర్‌ను షారుక్ సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. స్క్రిప్ట్, తన రోల్ నచ్చినప్పటికీ ఫుల్ లెంగ్త్ పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నట్లు షారుక్ చెప్పారట. దీంతో ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని సంప్రదించారట లోకేష్. రోల్ బాగా నచ్చడంతో సినిమాకి సైన్ చేసేందుకు రణవీర్ ఒప్పుకున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇదే జరిగితే హిందీలో తలైవర్ 171కి మంచి బజ్ వచ్చే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తలైవర్ 171పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ప్రస్తుతం తలైవర్ 171 (వర్కింగ్ టైటిల్) సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అందుకే ఎవరికీ అందుబాటులో లేను. నాతో మాట్లాడేందుకు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. కానీ వారందరికీ చెప్పే విషయం ఏంటంటే నేను 2-3 నెలలుగా అసలు ఫోన్‌యే వాడటం లేదు. కేవలం రజినీ సార్‌తో మాత్రమే టచ్‌లో ఉన్నాను. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం నాకు మరో 2-3 నెలల సమయం పడుతుంది." అంటూ లోకేష్ చెప్పారు. ఇటీవలి కాలంలో సౌత్ సినిమాల్లో పలు ముఖ్యమైన పాత్రలను బాలీవుడ్ హీరోలకి ఇస్తున్నారు డైరెక్టర్లు. కేజీఎఫ్, లియో, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ విలన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అలాగే యానిమల్, కంగువా సహా పలు సౌత్ ప్రౌజెక్టుల్లో బాబీ డియోల్‌కి సూపర్ రోల్స్ దక్కాయి. దీని వల్ల బాలీవుడ్‌లో కూడా సౌత్ సినిమాలకి మంచి క్రేజ్ ఏర్పడుతోంది. కలెక్షన్ల పరంగా కూడా బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్లు కూడా సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.🎥✨

bottom of page