ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగుతో సహా బాలీవుడ్ లోనూ రికార్డుల మోత మోగించింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మకు ఊహించిన ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హనుమాన్ సినిమా డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా టైటిల్ పై కూడా గాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘రాక్షస్’ అనే మోస్ట్ పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది . ఈ వార్త విన్న రణ్‌వీర్ సింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చెబుతున్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న సింగం సిరీస్ లోనూ అతను నటించారు. అలాగే ‘డాన్ 3’ చిత్రంలోనూ రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతే ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేసేందుకు రణ్ వీర్ అంగీకరించినట్లు సమాచారం.
రరాక్షస్ సినిమా గురించి ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. మరో నివేదిక ప్రకారం, ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి పూజలు కూడా జరిగాయని సమాచారం. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఉంటుందని అంటున్నారు. ‘రాక్షస’ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యంలో సాగుతుంది. ఈ కథకు పౌరాణిక నేపథ్యం కూడా ఉంటుంది. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో వచ్చే పాత్ర ఇది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని కొత్త అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, షూటింగ్ డేట్ గురించి ఫైనల్ డిస్కషన్ జరుగుతుందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.