top of page
MediaFx

సల్మాన్ “సికందర్” లో హీరోయిన్ గా రష్మిక!🎬💫


గతేడాది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన అనిమల్ చిత్రం లో ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది రష్మిక మందన్న. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ హీరోయిన్ మరొక బాలీవుడ్ భారీ చిత్రం లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సికందర్. నడియద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై సాజిద్ నదియద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో రష్మిక ఫీమేల్ లీడ్ రోల్ లో నటించనుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఛాన్స్ రావడం పట్ల రష్మిక సంతోషం వ్యక్తం చేస్తోంది. యంగ్ హీరో శివ కార్తికేయన్ తో మురుగదాస్ చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత ఈ పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అవుతుంది. హై ఆక్టేన్ యాక్షన్, ఎమోషన్స్, సోషల్ మెసేజ్ తో పాటుగా, సల్మాన్ ఖాన్ ను ఇందులో కొత్తగా చూపించనున్నారు డైరెక్టర్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



bottom of page