మేషం
గురు, శనుల అనుకూలతతో పాటు పంచమంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాలు చేపట్టడం మంచిది. జీవితం సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. భరణి నక్షత్రంవారికి మరింతగా శుభ యోగం పడుతుంది.
వృషభం
గురు, రాహువులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాలుగవ స్థానంలో బుధ, రవుల కలయిక కారణంగా రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరి స్థితులుంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరమైనవారికి వీలైనంతగా సహాయం అందజేస్తారు.కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కృత్తిక నక్షత్రం వారు బాగా లాభపడతారు.
మిథునం
గురువు లాభస్థానంలో అనుకూల సంచారం చేయడం ఈ రాశివారికి అనేక దోషాలను, సమస్య లను తొలగిస్తుంది. ఆదాయం కలిసి రావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండడం, మనసులోని కోరికలు నెరవేరడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి కొనసాగుతుంటాయి. ఇతర శుభ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవ కాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పునర్వసు నక్షత్రం వారికి మరింత బాగుంటుంది.
కర్కాటకం
ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్న మైనా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. పుష్యమివారికి బాగా కలిసి వస్తుంది.
సింహం
భాగ్య స్థానం నుంచి గురువు వీక్షణ, రాశిలో రవి, బుధుల కలయిక వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యో గాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. సమాజంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగు తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడ తాయి. మీ సలహాలు, సూచనలకే కాదు మీ సిఫారసులకు కూడా విలువ ఉంటుంది. జీవిత భాగ స్వామి సహకారం ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు. పుబ్బవారికి అదృష్టం పడుతుంది.
కన్య
లాభస్థానంలో ఉన్న శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నప్పటికీ, రోజంతా సాఫీగా, ఉత్సాహంగా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్న సమస్యలను, ఒత్తి ళ్లను పక్కనపెట్టి, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. దేవాలయాలు సందర్శించడం గానీ, విహార యాత్రకు వెళ్లడం గానీ జరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం, ఆదా యం బాగానే ఉంటాయి. ఉత్తర వారికి మాత్రం వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.
తుల
గురు, శుక్ర, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి కావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందడం, ముఖ్యంగా లాభదాయక పరిచయాలు ఏర్పడడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. సంసార జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు. స్వాతి, విశాఖ నక్షత్రాలవారు అందలాలు ఎక్కుతారు.
వృశ్చికం
బుధ, రవి, కుజులు అనుకూల స్థానాలలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కెరీర్ కు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. వ్యాపారాల్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగు తాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనవ సర ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. జ్యేష్టా నక్షత్రం వారు శుభవార్త వింటారు.
ధనుస్సు
ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. కెరీర్ పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్ని హితులు కొందరు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పూర్వాషాఢ వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.
మకరం
శుక్ర, శని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తి కరంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి హోదా పెరిగే సూచనలున్నాయి.
కుంభం
ఈ రాశివారికి సప్తమంలో బుధాదిత్యయోగం వల్ల జీవిత భాగస్వామికి యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరు వ్యతిరేక ప్రచారం చేసే సూచనలున్నాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పూర్వాభాద్రకు విదేశీయాన యోగం ఉంది.
మీనం
శుభ గ్రహాలైన గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం లేదా రాబడి పెరుగుతుంది. ఏలిన్నాటి శని కారణంగా వృథా ఖర్చుల మీదా, అనారోగ్యాల మీదా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది.