మేషం ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి జీవితంలో అదృష్టం పండుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. అధికారులు ఆదర భావంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. చివరి క్షణంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక వ్యవహా రాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు, అవివాహితులకు సానుకూల సమాచారం అందుతుంది.
వృషభం వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా కొందరితో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహకారంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సాధారణంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం మీ పనితీరు ద్వారా అధికారులను ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ముందుకు వెడతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిగా ఊగిసలాట ధోరణి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని అవసరాల విషయంలో ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద పెండింగు పనులను పూర్తి చేస్తారు. లాభాలకు, రాబడికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఇంటా బయటా ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. సింహం ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కన్య వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో మిత్రులు కొందరు అండగా నిలబడతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
తుల వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో మీ వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం మారే విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడ తాయి.
వృశ్చికం వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు అధికారుల నుంచి, సహో ద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీ ప్రతిభకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధా న్యం పెంచుకుంటారు. అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. భాగస్వాములతో విభేధాలు సమసిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మకరం వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తా యి. ఆర్థిక లావాదేవీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. బంధువుల ద్వారా ఆస్తి వ్యవహారాన్ని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో వ్యక్తిగత పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆనం దోత్సాహాలు లభిస్తాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందగిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా, ప్రయోజనకరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసు కుని విందులో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడతారు. ఆదాయం పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు.