top of page
Shiva YT

రాశిఫలాలు


మేషం

ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి, బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృషభం

మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహా రాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగిపోతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహా రాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు ఆశించిన విజయాలు సాధి స్తారు.

మిథునం

అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అంచనాలకు మించి మేలు జరుగుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. మిత్రులతో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందు తాయి.

కర్కాటకం

ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

సింహం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కారం అవు తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లలు చదువుల్లో లేదా ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆహార, విహారాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

కన్య

ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడే సూచనలున్నాయి. ఆరోగ్యం అనుకూలి స్తుంది.

తుల

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి రంగంలోని వారికి సమాజంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. సరైన సలహాలు, సూచనలతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లతో ఇబ్బందులుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. సతీమణికి చిన్నపాటి అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు

అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు చేకూరుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా ఒకటి రెండు చక్కబడతాయి. అనుకోకుండా మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

మకరం

సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థికంగా కొంత మెరుగైన పరి స్థితులు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుం టాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

కుంభం

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపం దుకుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ, ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితంలో మంచి పరిణా మాలు చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం పట్ల, ప్రయాణాలలోనూ వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.

మీనం

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణ యాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపో తుంది. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

bottom of page