విభిన్న కథలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు దివంగత చలపతిరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలతో మెప్పించాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేశారు రవిబాబు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వరుసగా అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవిబాబు. కాగా పార్టీ సినిమా తర్వాత తన పంధా మార్చుకున్న ఈ టాలెండ్ డైరెక్టర్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ వైపు టర్న్ అయ్యారు.
ఈ క్రమం ఆయన తెరకెక్కించిన అనసూయ, అమరావతి సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. అలాగే నచ్చావులే అనే ప్రేమకథ కూడా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆతర్వాత వచ్చిన మనసారా సినిమా పర్లేదు అనిపించుకుంది. అలాగే హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన అవును సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు రవిబాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే అవును 2 కూడా తెరకెక్కించారు. లడ్డు బాబు అనే సినిమా కూడా చేశారు. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ గా పూర్ణ చేశారు. ఆ తర్వాత రవిబాబు, నటి పై రూమర్స్ మొదలయ్యాయి. ఈ ఇద్దరూ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
రవిబాబు వరుసగా పూర్ణతో సినిమాలు చేయడంతో ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది. పూర్ణ పెళ్లి ముందు వరకు ఈ వార్తలు వైరాల్ అవుతూనే ఉన్నాయి. వీటి పై గతంలో రవిబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారం పై అసలు విషయం చెప్పుకొచ్చారు. పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చాయని అన్నారు రవిబాబు. బ్యాక్ టు బ్యాక్ ఆమెతో సినిమాలు చేయడం వల్లే మా ఇద్దరి మధ్య ఎదో జరుగుతుందని అంతా అనుకున్నారు. పైగా మీడియా దాన్ని పదే పదే స్ప్రెడ్ చేయడంతో ఈ రూమర్ ఎక్కువగా వినిపించింది. ఆమె ఎక్కడో కేరళలో పుట్టింది అనవసరంగా ఆమెకు నాకు లింక్ పెట్టారు. నా పరంగా కథకు , పాత్రకు సెట్ అయ్యే హీరోయిన్స్ ను ఎంపిక చేసుకుంటాను. అవును సినిమాకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేశాను. చాల చాలా హార్డ్ వర్కర్, డెడికేషన్‌తో పని చేస్తుంది. వన్ మోర్ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్‌తో, కాన్‌సన్‌ట్రేషన్‌తో పని చేస్తుంది. ఇప్పుడు నేను రష్ అనే సినిమా చేస్తున్నా.. ఆమె ఫైట్స్ చేస్తే ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటా కానీ ఆమె మంచి డాన్సర్, ఫైట్స్ పెద్దగా చేయలేదు అని రవిబాబు తెలిపారు.