top of page
Suresh D

🏁 రేసు నుంచి తప్పుకున్న రవితేజ.. ఈగల్ మూవీ వాయిదా 🎬

🎉 సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమా తప్పుకుంది. రవితేజ, ఈగల్ నిర్మాతలు కాస్త వెనుకడుగు వేశారు. చివరకు సోలో డేట్ వస్తుందని హామీ ఇవ్వడంతోనే ఇలా తప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఈగల్ వాయిదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 🔥

👑 మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఈ మేరకు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ ప్రకటించారు. ఐదు రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి చర్చించామని, గ్రౌండ్ రియాలిటి వివరించామని తెలిపాడు. ప్రతి ఏడాది ఉండే ఇబ్బందే ఇప్పుడు కూడా ఉందని చెప్పారట. రవితేజ ఈగల్ సినిమా వెనక్కి వెళ్లేందుకు నిర్మాత అంగీకరించారని తెలిపారు. ఈగల్ నిర్మాతకు, రవి తేజకు థాంక్స్ చెప్పుకొచ్చాడు దామోదర్ ప్రసాద్. 🙏

📅 ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడంతో ఇలా ఈగల్ టీం మాత్రం కాస్త కన్విన్స్ అయినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో వారికి సోలో డేట్ ఇవ్వడానికి ఓకే చెప్పారు. దీంతో ఫిబ్రవరి 9 మీద ఈగల్ నిర్మాతలు కన్నేసినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి బరిలోంచి బయటకు పోవడంతో ఫిబ్రవరి 9ని ఇచ్చేందుకు అంతా ఓకే అన్నారట. 📆

🎬 ఆ డేట్‌కు ఆల్రెడీ సిద్దు డీజే టిల్లు స్క్వేర్, సందీప్ కిషన్ భైరవ కోన కూడా ఉన్నాయి. మరి ఈగల్ దెబ్బకు అవి రెండు హుష్ కాకి అయ్యేలా ఉన్నాయి. ఇక యాత్ర 2 కూడా బరిలోనే ఉంది. అయితే యాత్ర నిర్మాతతో మాట్లాడి సర్దు బాటు చేస్తామని దిల్ రాజు హాామీ ఇచ్చాడట. అలా మొత్తానికి ఈగల్ మాత్రం ఫ్యాన్స్‌కి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆశలు రేపి నీళ్లు చల్లినట్టు అయింది. ఈ నిర్ణయం మీద మాస్ మహారాజా ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కలిసి మా రవన్నను ఇలా సైడ్ చేశారు కదరా అంటూ ట్వీట్లు పెడుతున్నారు. 🤝

bottom of page