top of page
MediaFx

శ్రీరామ నవమి రోజున రాముడి నుదిటపై సూర్య కిరణాలు..

ఇప్పుడు మీరు చూడబోయేవి అద్భుత, అపురూప దృశ్యాలు. ఇవి రోజూ చూసే దృశ్యాలు మాత్రం కావు. అయోధ్య బాల రాముడికి అర్చకులు నిత్యం తిలకం దిద్దుతారు.

అదే సూర్యుడే దిగి వచ్చి తిలకం దిద్దితే..! అదే జరిగింది. అయోధ్యలో కొలువు దీరిన బాల రాముడికి తన కిరణాలతో సూర్యుడే స్వయంగా తిలకం దిద్దాడు. ఈ సూర్య తిలక్‌ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టినప్పుడే శ్రీరామ నవమి నాడు సూర్య కిరణాలు. రామ్‌ లల్లా విగ్రహం నుదుటి భాగంలో ప్రసరించేటట్లు ఆలయాన్ని నిర్మించారు. త్వరలో శ్రీరామ నవమి రానున్న నేపథ్యంలో ఇవాళ బాల రామయ్యకు సూర్యాభిషేకం రిహార్సల్స్‌ను నిర్వహించారు. అది దిగ్విజయంగా జరగడంతో ఆలయ అర్చకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

సాధారణ రోజుల్లో బాల రాముడికి సూర్యాభిషేకం ఉండదు. సూర్య కిరణాలు ఆయన నుదుటిని తాకవు. అయితే శ్రీరామ నవమి నాడు…బాల రామయ్యను దర్శించుకోవడమే కాకుండా ఆయనను స్పృశించే భాగ్యం కూడా సూర్య భగవానుడికి దక్కుతుంది. మనం రెండు బాక్సుల్లో సాధారణ రోజుల్లో రామ్‌ లల్లా విగ్రహానికి జరిగే సేవలను, శ్రీరామ నవమి లాంటి ప్రత్యేక పర్వ దినాల్లో బాల రామయ్యకు సూర్య తిలకం ప్రసరించే దృశ్యాలు కనువిందు చేశాయి.

ఏఫ్రిల్ 17న శ్రీరామ నవమి రాబోతోంది. ఆ సందర్భంగా సూర్య భగవానుడి కిరణాలు బాల రామయ్య ఫాల భాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య ఆలయ అధికారులు ఇవాళ నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతమయ్యాయి. ఇది తమలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని రామ మందిరంలో దర్శన విభాగ ఇన్‌చార్జి గోపాల్‌ జీ చెప్పారు. ఇక శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకుతాయని ఆయన తెలిపారు.

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు రామ్ లల్లా విగ్రహాన్ని సూర్య తిలకంతో అలంకరించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ వ్యవస్థ. దీనిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు సహకారంతో ఆప్టికా రూపొందించిన ప్రాజెక్ట్. ఖచ్చితమైన లెన్స్‌లు, మిర్రర్‌లతో కూడిన ప్రత్యేకమైన డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఈ మూలకాలు సహజ సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి. ఈ శుభ సందర్భంలో దానిని దైవిక చిహ్నంగా మారుస్తాయి. ఈ వ్యవస్థ సూర్యకాంతి కిరణాన్ని రామ్ లల్లా నుదుటిపైకి మళ్లిస్తుంది. పూజ్యమైన ‘సూర్య తిలకం’ని పూజ్యత వేడుకలకు చిహ్నంగా సృష్టిస్తుంది. మూడు నుండి నాలుగు నిమిషాలు, దాదాపు ఆరు నిమిషాల వరకు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించవచ్చు.

bottom of page