రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగకు వింత శిక్ష.. నవ్వు ఆపుకోలేరు
- MediaFx
- Aug 24, 2024
- 1 min read
ఎన్‌సీఆర్‌లో రీజియన్‌లో ఓ వ్యక్తి గోల్డ్ చైన్‌ను కొట్టేసే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో మొదట అతన్ని బెదిరించిన ప్రజలు ఆ తర్వాత అతనికి ఓ వింత శిక్ష వేశారు. అటు దొంగను కొట్టకుండా, ఇటు పోలీసులకు పట్టించకుండా భోజ్‌పురి పాటకు బలవంతంగా డ్యాన్స్ చేయించారు. స్టెప్పులు వేయాలంటూ బలవంతం పెట్టారు. దీంతో దొరికిన ఆ వ్యక్తి చేసేది ఏం లేక వాళ్లు చెప్పినట్లు పాటకు కాలు కదిపాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారంత ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దొంగ దొరికితే శిక్షించే వారిని చూశాం కానీ ఇలా పాటలకు డ్యాన్స్ చేయించిన వారిని ఎక్కడా చూడలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఇలా పోస్ట్ చేశారో లేదో అలా నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 9 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. దొరికిన దొంగకు సరైన బుద్ధి రావాలంటే ఫిజికల్ దాడుల కంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని మరికొందరు భావిస్తున్నారు. ఇలా చేస్తే మరోసారి దొంగతనం చేయడానికి జంకుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.