top of page

🧘‍♂️ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే..

Shiva YT

🤔 ఈ ఆసనాలతో ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆసనాలు ఏంటి? ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.

🧘‍♂️ వజ్రాసనం: చాలా మందికి ఈ ఆసనం గురించి తెలిసే ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకునేందుకు బాగా సహాయ పడుతుంది. భోజనంన చేసిన ఓ పది నిమిషాల తర్వాత ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల కడుపులో కొవ్వు అనేది బాగా కరుగుతుంది. వజ్రాసనం వేయడానికి ముందు.. మడమలపై కూర్చోవాలి. ఆ తర్వాత పాదాలు వెనక్కి చాచి.. పిరుదుల కింద పెట్టాలి. నడుమును నిటారుగా ఉంచుకోవాలి. ఆసనంలో కూర్చుని ఊపిరిని పీల్చుతూ.. వదులుతూ ఉండాలి.

🧘‍♂️ తిర్యక్ భుజంగాసనం: ఈ ఆసనం కూడ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో బాగా సహాయ పడుతుంది. అలాగే జీర్ణ క్రియను కూడా మెరుగు పరుస్తుంది. తిర్యక్ ఆసనం వేయడం వల్ల కడుపులోని కండరాలు అనేది బలపడతాయి. ముఖ్యంగా మల బద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. ఈ ఆసనం వేయాలంటే ముందుగా.. వెల్లకిలా పడుకోవాలి. నుదురు అనేది నేల మీద ఉండేలా చేయాలి. కుడి చేతిని వెనక్కి చాచి. ఎడమ మోకాలి కింద ఉంచాలి. అదే విధంగా ఎడమ చేతిని కూడా.. కుడి మోకాలిని పట్టుకోవాలి. ఇప్పుడు తలను పైకి ఎత్తి.. ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి. ఆసనం చేయాలంటే.. యోగా ట్రైనర్ సహాయం తప్పకుండా కావాలి.

🧘‍♂️ పవనముక్తాసనం: పవన ముక్తాసనం కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల కడుపు కండరాలు అనేవి బల పడతాయి. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. ముందుగా కింద పడుకోవాలి. ఆ తర్వాత ఊపిరి పీల్చుతూ.. కుడి మోకాలిని ఛాతీ వైపుకు లాగి.. చేతులతో పట్టుకోవాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉండి.. మళ్లీ ఎడమ మోకాలితో కూడా ఇలా చేయాలి. దీని వల్ల కడుపై ఒత్తిడి పడి.. కొవ్వు కరుగుతుంది. 🌬️

 
bottom of page