top of page
MediaFx

రీల్స్‌ పిచ్చితో రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువతి..


సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే క్రేజ్‌ ఇటీవల బాగా పెరిగిపోయింది. ఇందుకోసం కొందరు ఫన్నీగా ట్రై చేస్తుంటారు. మరికొందరు డ్యాన్స్, పాటలు, పెయింటింగ్, సామాజిక సందేశాల వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అయితే ఇక్కడ రైల్వే ప్లాట్ ఫాంపై ఓ యువతి రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో పక్కనే ఉన్న మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. కోపోద్రిక్తురాలైన ఆ మహిళ యువతి చేసిన వింత ప్రవర్తనతో విసిగిపోయింది. దాంతో చిర్రెత్తిన ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో హాస్యాస్పదంగా డ్యాన్స్ చేసి ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన అదే అమ్మాయికి సంబంధించినది ఈ ఇన్‌స్టా అకౌంట్‌. వైరల్ వీడియోలో, ముంబైలోని రైల్వే స్టేషన్‌లో సీమా విచిత్రంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. నేలపై దొర్లుతూ ప్రయాణికులను ఢీకొంటూ వీడియో షుట్‌ చేసింది. ఇది చూసిన ఓ మహిళ ఆగ్రహానికి గురై ఆమెను కొట్టింది. ఈ వీడియో స్క్రిప్ట్ చేసినదా లేదా వాస్తవమా అనేది తెలియదు. కానీ ప్రజలు దీనిపై భిన్నమైన స్పందన తెలియజేస్తున్నారు.



bottom of page