top of page
MediaFx

రిలయన్స్ డిజిటల్‌లో అదిరిపోయే సేల్ షురూ..

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మార్కెట్ ఎంత వృద్ధి చెందినా ఆఫ్‌లైన్ మార్కెట్‌కు ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. మనం కొనాలనుకునే ఉత్పత్తులను చూసి కొనే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రముఖ రిటైలర్ సంస్థ రిలయన్స్ డిజిటల్‌లో ప్రస్తుతం అదిరిపోయే సమ్మర్ సేల్ నిర్వహిస్తుంది. మీరు ఈ వేసవి సీజన్‌లో కొత్త ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఏసీను కొనుగోలు చేయాల డిజిటల్ డిస్కౌంట్ డేస్‌లో మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్‌లో వినియోగదారులు యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లతో పాటు ఏసీ, రిఫ్రిజిరేటర్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై డీల్స్, డిస్కౌంట్లను పొందవచ్చు. డీల్స్‌తో పాటు కొనుగోలుదారులు ప్రముఖ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో డిజిటల్ డిస్కౌంట్ డేస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 12,000 వరకు డబుల్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. దీనితో పాటు రిటైలర్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎం1 మోడల్‌పై 33 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు కేవలం రూ. 54తో నో కాస్ట్ ఈఎంఐను పొందవచ్చు. కస్టమర్లు ఐప్యాడ్ 9వ తరం వైఫై 64 జీబీ మోడల్‌ను 23,900 రూపాయల తగ్గింపు ధరతో పొందవచ్చు.

డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ సమయంలో  కస్టమర్‌లు 1 టన్ను 3-స్టార్ ఇన్వర్టర్ ఏసీను రూ. 20, 990 వద్ద కొనుగోలు చేయవచ్చు. మీరు తగ్గింపు తర్వాత 61,990 రూపాయలకు హై-ఎండ్ 11 కిలోలు లేదా 7 కిలోల వాషర్ డ్రైయర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ వేసవిలో రూ.49,990 తగ్గింపు ధరతో ప్రక్క ప్రక్క రిఫ్రిజిరేటర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎల్‌జీ నుంచి 45 శాతం తగ్గింపుతో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. సామ్‌సంగ్ నియో క్యూ ఎల్ఈడీ  టీవీలు రూ. 79,990 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కొనుగోలుదారులు డాల్బీ అట్మాస్ సౌండ్ బార్‌పై 65 శాతం వరకు తగ్గింపు, బోస్ సౌండ్‌బార్ 900పై 30 శాతం తగ్గింపును పొందవచ్చు.

bottom of page