పవన్ తో జతకట్టిన హీరోయిన్ కెరీర్ ఢమాల్ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. దాదాపు పది మందికి పైగా హీరోయిన్స్ కెరీర్ గంగలో కలిసిపోయింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నుండి నికీషా పటేల్ వరకూ ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు...
అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, పవన్ కళ్యాణ్ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి' మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత సుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా చిత్రాలు చేస్తుంది.
పవన్ కళ్యాణ్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది.
తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పరిశ్రమకు దూరమైన కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు.
తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా పరిస్థితి కూడా సేమ్, మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు. ప్రీతి కూడా వివాహం చేసుకుంది.
ఇక బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. రేణు దేశాయ్ ఆయన్నే పెళ్లి చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. అమీషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బద్రి అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అట్టర్ ప్లాప్. బాలీవుడ్ లో కూడా ఆమె స్టార్ కాలేకపోయింది.
ఇక గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరీర్ కూడా గాల్లో కలిసిపోయింది.
బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి అగమ్యగోచరమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బంగారం ప్లాప్ కావడంతో మీరా కెరీర్ చతికిల పడింది. అప్పుడప్పుడు మీరా చోప్రా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది.
ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కెరీర్ అనూహ్యంగా ముగిసింది. బాలీవుడ్ లో ఎదగాలని ముంబై వెళ్లిన ఇలియానా... రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసిన ఇలియానా అబ్బాయికి జన్మనిచ్చింది.
పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. పవన్ తో ఛాన్స్ కొట్టేశానని ఎగిరి గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆపై నికీషా పటేల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది.
పంజా సినిమాలో పవన్ కి జంటగా కనిపించిన సారా జేన్ దియాస్, అంజలి లావణ్యల గురించి ఆ దేవుడికే తెలియాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కెరీర్లో సక్సెస్ కాలేకపోయారు.
అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఇలా పదికి పైగా హీరోయిన్స్ పవన్ తో నటించి పరిశ్రమ నుండి వెళ్లిపోయారు.