top of page
MediaFx

ఆయనే వదిలేశాడు నేను కాదు!.. టార్చర్ చేయకండి..


రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె అకీరా, ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరలవుతుంటాయి. నిత్యం తన ఫ్యామిలీ విషయాలతోపాటు.. జంతువుల సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తుంటారు. అయితే ఆమె ప్రతి పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటారు. తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి చెప్పింది. తానే తన చేతులతో ప్రసాదం చేశానని.. ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేత్తో ప్రాసంద చేయడం అంటే ఇష్టమని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఆమె షేర్ చేసిన వీడియో పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు.

అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ 'వదినగారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుడ్ని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలా వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నాం' అంటూ కామెంట్ చేశాడు.

అందుకు రేణూ దేశాయ్ రియాక్ట్ అవుతూ మీకు కొంచమైనా బుద్ది ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు.. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయద్దు. ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇంకో నెటిజన్ సూపర్ అమ్మ మీరు.. అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా ? .. అంటే అర్థం ఏంటీ? నాకు నా సొంత లైఫ్ ఉండదా..? మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధపెడుతున్నారు రేణు దేశాయ్ ఆవేదన చెందారు.


bottom of page