top of page

రేణుకాస్వామి క్షమించమని కోరినా దర్శన్‌ టీం కనికరించలేదా..?


పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్‌ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను గుర్తించారు.

ఇదిలా ఉంటే తాజాగా బాధితుడు రేణుకాస్వామి చొక్కా లేకుండా కనిపిస్తున్న స్టిల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతూ.. కలకలం రేపుతున్నాయి.


రేణాకాస్వామి తనను క్షమించాలని వేడుకుంటుండగా.. దర్శన్‌ గ్యాంగ్‌ కనికరించకుండా దారుణంగా కొట్టి చంపినట్టుగా ఫొటోలు చూసిన నెటిజన్లు, జనాలు చర్చించుకుంటున్నారు. హత్య అనంతరం రేణుకా స్వామి మృతదేహాన్ని కామాక్షి పాల్య పీఎస్‌ పరిధిలోని సుమనహల్లి రోడ్‌ సైడ్‌ డంప్‌లో పడేశారు. మృతదేహాన్ని చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్‌ పోలీసులకు సమాచారమందించారు. రేణుకాస్వామితల,ముఖం, డెడ్‌బాడీపై గాయాలు గుర్తించారు. ఈ ఫొటోలు


మొత్తం 3,991 పేజీలతో ఉన్న ఛార్జిషీట్‌లో ఏ1గా హీరోయిన్‌ పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్‌ పేర్లను పేర్కొన్నారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్‌ చార్జిషీట్‌ను కోర్టులో ఫైల్‌ చేసింది. ఈ సందర్భంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీ నివేదికలను సైతం సిట్‌ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికిపైగా పోలీసులు, ఎనిమిది మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.

bottom of page