top of page
Shiva YT

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం ఆరా.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో యశోద హాస్పిటల్‌కు ఆరోగ్యశాఖ కార్యదర్శి🏥👨‍⚕️🔍

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కేసీఅర్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీను యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. గాయం కారణంగా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలనే అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వైద్యులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డికి పరిస్థితిని వివరించారు రిజ్వీ. – కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో రిజ్వీ మాట్లాడారు. గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్‌ కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, సీటీ స్కాన్‌ కూడా చేసి శస్త్రచికిత్స అవసరం తెలిపారు. తాజాగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని సూచించారు. 💉🚑📋

bottom of page