హామీలదేముంది నోటిమాట..కానీ అమలు చేయాలంటే నోట్ల మూటలు కావాలి. సంపదను సృష్టించాలి…అభివృద్ధినీ చూపించాలి.💼📈
ఈరెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగించాలి. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తాము అధికారంలోకి వస్తే.. దళారులు రాజ్యం, సింగిల్ విండో సిస్టమ్ ఉండదని రేవంత్ ఎన్నికలకు ముందు టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. తమది ప్రజల రాజ్యం అని.. ప్రజల పాలన వస్తుందని వివరించారు. ప్రజలు ప్రగతి భవన్‌కు ఎప్పుడైనా, రావొచ్చు పోవచ్చన్నారు. సచివాలయాకు ఎప్పుడైనా వచ్చి.. వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చన్నారు. సమాజంలోని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన మాట నిలబెట్టుకున్నారు. 🌐💼📈