top of page
Suresh D

📢🚫రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. గృహలక్ష్మి పథకం రద్దు..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సొంత జాగా ఉన్నవారికి అభయహస్తం ఆరుగ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.🏠💼

bottom of page