top of page
MediaFx

రోబోకు ‘ప్రభుత్వ ఉద్యోగం’..పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య!


‘ప్రభుత్వ ఉద్యోగం’ చేస్తున్న ఓ రోబో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందంటూ దక్షిణ కొరియాలో జనాలు ప్రస్తుతం గగ్గోలు పెడుతున్నారు. దీన్ని దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. ఛిద్రమైన రోబోను ఓ బహుళ అంతస్తుల భవనంలో గుర్తించారు. అసలు రోబో ఆత్మహత్య పాల్పడటమేమిటని అనేక మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది గుమీ సిటీ కౌన్సి్ల్‌లో ఈ రోబోను గతేడాది ఆగస్టులో పనిలో పెట్టుకున్నారు. అక్కడి వారు దీన్ని రోబో సూపర్‌వైజర్‌గా పిలుస్తున్నారు. అక్కడ అన్ని పనులూ రోబో చక్కపెట్టేసేది. వివిధ డాక్యుమెంటగ్లను ఓ అంతస్తు నుంచి మరో అంతస్తుకు చేరవేయడం, నగరానికి ప్రచారం కల్పించడం, స్థానికులకు మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారాన్ని అందించడం చేసేది. తనంతట తానుగా లిఫ్ట్ వినియోగిస్తూ వివిధ అంతస్తులకు చేరుకునేది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పని చేసేది. అమెరికాలోని కాలిఫోర్నియాలోగల బేర్ రోబోటిక్స్ ఈ రోబో ను డిజైన్ చేసింది. రెస్టారెంట్లలో వెయిటర్లుగా చేసే రోబోలను తయారు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. కానీ, గూమీ సిటీ కౌన్సిల్‌లో ఈ రోబో పలు అదనపు బాధ్యతలు నిర్వహించింది ఘటనకు ముందు రోబో అసహజంగా ఒకే చోట పదే పదే తిరుగుతూ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు కనిపించిందని కొందరు సాక్షులు పేర్కొన్నారు. ఆ తరువాత భననంపై నుంచి పడిపోడి ముక్కలు ముక్కలైంది. రోబో శకలాలను మొదటి రెండస్తుల మధ్యలో గుర్తించారు. అసలు ఇది నిజంగానే రోబో ఆత్మహత్యా లేక సాంకేతిక లోపం కారణంగా కిందపడిపోయిందా అని చర్చ కూడా కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో గుమీ కౌన్సిల్ రోబోల వినియోగాన్ని నిలిపివేసింది. ప్రతి పనిని రోబోలు, యంత్రాలతో చేయించుకోవాలన్న ఆసక్తి కలిగిన దేశంలో ఈ ఉదంతం పెను కలకలమే సృష్టిస్తోంది. రోబో వినియోగానికి సంబంధించిన నైతిక, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

bottom of page