టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించి చెప్పిన మాటలతో.. భారత అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వన్డే క్రికెట్ ఎప్పటి వరకు ఆడగలరో గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఫిట్‌గా ఉంటే ODI ప్రపంచ కప్ 2027 వరకు ఆడతారంటూ ప్రకటించాడు. అయితే, గౌతమ్ గంభీర్ ఈ ప్రకటనతో మాజీ క్రికెటర్ కృష్ణమ్మాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించారు. యూట్యూబ్ లైవ్‌లో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై శ్రీకాంత్ ప్రశ్నలు సంధించాడు. 2027 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడకూడదంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్‌కి శ్రీకాంత్ చోటు ఇవ్వలేదు..
2011లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ జట్టు చీఫ్ సెలక్టర్ కే. శ్రీకాంత్. శ్రీకాంత్ రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించాడు. అతని స్థానంలో యూసుఫ్ పఠాన్‌కు అవకాశం ఇచ్చాడు. రోహిత్ శర్మకు వ్యతిరేకంగా శ్రీకాంత్ నిరంతరం స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉంటాడు. పెద్ద విషయం ఏమిటంటే హిట్‌మాన్ తరచుగా అతనిని తప్పుగా రుజువు చేస్తుంటాడు. 2027 ప్రపంచకప్‌లో ఈ ఆటగాడు టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఉంటాడని, ఆ తర్వాత భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని రోహిత్ అభిమానులు ఆశిస్తున్నారు.