భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బౌలింగ్ చేయడానికి సరైన రన్-అప్ తీసుకోవడంలో పదేపదే తప్పులు చేసిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను కొట్టడానికి రోహిత్ శర్మ పరుగులు తీస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలిలా ఉన్నాయి,,, శ్రీలంక ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ బౌలింగ్ చేయాల్సిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రన్‌అప్ తీసుకోవడంలో మూడుసార్లు తడబడ్డాడు. సుందర్ మొదటి రన్-అప్ తీసుకోవడానికి తడబడినప్పుడు రోహిత్ స్పందించలేదు. కానీ రెండోసారి అదే జరగడంతో రోహిత్ సుందర్ వైపు కోపంగా చూశాడు. అక్కడితో ఆగని సుందర్ మూడోసారి కూడా అదే తప్పు చేశాడు. ఈ సమయంలో రోహిత్ ఓపిక నశించి సుందర్ ను కొట్టేందుకు పరిగెత్తాడు. అయితే ఇదంతా సరదాగా జరిగినదే. ఇది గమనించిన మిగతా ఆటగాళ్లతో పాటు సుందర్ కూడా నవ్వుకున్నాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ,వాషింగ్టన్ సుందర్‌ల ఇలాంటి ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సుందర్ ఎల్ బీడబ్ల్యూకి అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. తర్వాత, వాషింగ్టన్ సుందర్ కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూడటం ప్రారంభించాడు. ఆ సమయంలో రోహిత్ కూడా స్లిప్‌లో ఉండటంతో బంతి ఎక్కడికి తగిలిందో అతనికి తెలియలేదు. సుందర్‌ని చూసి, రోహిత్, ‘ ఆ విషయాన్ని నువ్వే చెప్పాలి. నావైపు ఎందుకు చూస్తున్నావు? అన్ని విషయాలు నేను ఎలా చేయాలి?” అని రోహిత్ అన్నాడు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది.