top of page
Shiva YT

రొమాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. ఈగల్ హీరోయిన్ కావ్య థాపర్..

ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్‌లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ ఉంది. దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు (నవ్వుతూ). రవితేజ గారు, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్‌గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్‌పై రవితేజ గారు, డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులని చాలా గొప్పగా అలరిస్తుంది.రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్‌లో చాలా సరదాగా, సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈగల్ బ్యూటీఫుల్ జర్నీ. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్‌లో ఇంటర్ నేషనల్ లెవల్‌లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్‌లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను.

bottom of page