ఐపీఎల్ 2024 (IPL 2024) సందర్భంగా ముంబై ఇండియన్స్ (MI)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు RCB ప్లేఆఫ్ ఆశలు కూడా మసకబారాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. వారి ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో తెలియజేస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. RCB ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడగా, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. జట్టు సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై మాత్రమే విజయం సాధించింది. అయితే, అప్పటి నుంచి వారు వరుస మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సీజన్‌లో జట్టు బౌలింగ్ చాలా సాధారణంగా ఉంది. అందుకే 200 పరుగులకు దగ్గరగా స్కోర్ చేసినప్పటికీ, జట్టు ఏకపక్షంగా మ్యాచ్‌లో ఓడిపోయింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో RCB 9వ స్థానంలో ఉంది. వారికి ఇంకా 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే, వారు ఈ ఎనిమిది మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. RCB తన మిగిలిన 8 మ్యాచ్‌లు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లోకి వెళ్తుంది. అయితే, ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో 7 గెలిస్తే గరిష్టంగా 16 పాయింట్లు మాత్రమే పొందగలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఆర్‌సీబీ నెట్ రన్ రేట్‌పై ఆధారపడవలసి రావచ్చు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన భారీ ఓటమి తరువాత, జట్టు నెట్ రన్ రేట్ చాలా ఘోరంగా మారింది.ఇటువంటి పరిస్థితిలో RCB తన మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా ఒకటి లేదా రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాదించాలి . ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి, రెండు మ్యాచ్‌లు ఓడినా.. ఇంకా ముందుకు వెళ్లవచ్చు.🏏🏆