రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఈసారి పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు ఓడి పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
పంజాబ్‌పై గెలిచిన తర్వాత రెండు పాయింట్లు వచ్చాయి. రన్ రేట్ కూడా -1.185గా నిలిచింది. ఏడు గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. గణాంకాలను పరిశీలిస్తే RCB ప్లేఆఫ్ కల ఇంకా సజీవంగా ఉంది. అద్భుతం జరిగితేనే RCB ప్లేఆఫ్‌కు చేరుకోగలదు. RCBకి ఇంకా ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో ఏడు గేమ్‌లు కచ్చితంగా గెలవాల్సిందే. అలాగే ప్రస్తుతం ఉన్న మైనస్ రన్ రేట్‌ను ప్లస్ కు తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి తోడు మిగిలిన జట్ల మ్యాచ్ ఫలితాలు కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ పై ప్రభావం చూపనున్నాయి.ఏప్రిల్ 15న జరిగిన RCB vs SRH మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. దీంతో వెనుదిరిగిన ఆర్సీబీ జట్టు 262 పరుగులు మాత్రమే చేయగలిగింది 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్సీబీ ప్లేఆఫ్ కల అంత ఈజీ కాదు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనేది కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ‘ఈసాలా కప్ నమ్దే’ అనే నినాదాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత అలాగే కొనసాగనుంది.