తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఏది అంటే యట్ ప్రెజెంట్ చెప్పే ఒకే ఒక్క పేరు ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినప్పటికీ.. వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లెజెండ్రీ దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ప్రతిఒక్కరి చేత వావ్ అనేలా చేశారు రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా తీయడం అంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా సినిమాను తెరకెక్కించాలి. ఆవిషయంలో రాజమౌళి విజయం సాధించారు. ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా రామ్ చరణ్ ను అల్లూరి సీతారామ రాజుగా నటించారు.
ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను మెప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతి సన్నివేశం సినిమాకే హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేసే సీన్స్ కు ప్రేక్షకులు విజిల్స్ కొట్టేలా చేసింది. అలాగే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా బాలీవుడ్ లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా రీ రిలీజ్ చేయాలని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను బాలీవుడ్ లో రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.