2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి.నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో, బెంగళూరుకు ఐదో మ్యాచ్. అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 ఓటమి చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు మొత్తం 30 సార్లు తలపడ్డాయి. రాజస్థాన్ కంటే బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు 15 మ్యాచ్‌లు గెలుపొందగా, రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాబట్టి 3 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు.2020 నుండి రాజస్థాన్ vs బెంగళూరు మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ 1 మాత్రమే గెలవగలిగింది. 2022లో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో బెంగళూరుపై రాజస్థాన్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్ (కెప్టెన్)గా వ్యవహరిస్తున్నాడు. జోస్ బట్లర్, శుభమ్ దూబే, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, కుల్దీప్ లాంటి ఆటగాళ్లు ఉండటంతో జట్టుకు అదనపు బలాలుబెంగళూరు జట్టుకు డు ప్లెసిస్ కెప్టెన్ గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సౌరవ్ చౌహాన్, మహ్మద్ సిరాజ్ , కామెరాన్ గ్రీన్, టామ్ కర్రాన్ లాంటివాళ్లు జట్టులో కీలక ఆటగాళ్లు.