top of page
MediaFx

రూ. 500 అద్దె ఇంటి హోమ్‌ టూర్‌ వీడియో.. నెట్టింట తెగ వైరల్‌..


తాజాగా ముంబయికి చెందిన ఓ జొమాటో డెలివరి బాయ్‌ తాను నివసిస్తున్న అద్దె ఇంటికి సంబంధించి పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ముంబయిలో పేద వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో. హోమ్‌ టూర్‌ అనగానే ఇంధ్రభవనంగా భావిస్తాం. కానీ ఈ యువకుడు ఉంటున్న గది అద్దె కేవలం రూ. 500 మాత్రమే. ముంబయిలో మురికివాడలో ఉన్న ఈ గదికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ్‌ వైరల్‌ అవుతోంది. ప్రంజయ్‌ బోర్గోయరీ అనే యువకుడు ముంబయికి ఉద్యోగం చేయడానికి వచ్చాడు. అయితే ఉద్యోగన్వేషణలో ఉన్న బోర్గోరయరీ ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా జీవనం సాగిస్తున్నాడు. అత్యంత ఇరుకైన సంది గుండా లోపలికి వెళ్లగా. చిన్న మెట్ల మార్గం వస్తుంది. ఆ తర్వాత పైకి ఎక్కితే చిన్న గది ఉంది. ఒక విలాసవంతమైన ఇంట్లోని బాత్‌రూమ్‌ కంటే చిన్నగా ఉందీ గది. అయితే ఇందులో అతను మరో వ్యక్తితో కలిసి ఉండడం గమనార్హం. ఈ గదిని హోమ్‌ టూర్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. అంత చిన్న గదిలో ఉంటూ తాను పడుతోన్న ఇబ్బందులను, జీవన పరిస్థితులను వివరించాడు. ఇక తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రంజయ్‌కి మంచి రోజులు రావాలని కామెంట్స్‌ చేస్తున్నారు.



bottom of page