ఓటీటీలోకి వచ్చేసిన జగ్గూభాయ్ ‘రుద్రంగి’..🎬🍿
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
🎭🎞️ఇటీవల థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకున్న రుద్రాంగి సినిమా మూడు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను రూపొందించడం విశేషం.

🎭🎞️ఇటీవల థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకున్న రుద్రాంగి సినిమా మూడు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను రూపొందించడం విశేషం. జగపతిబాబుతో పాటు విమలారామన్, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్, ఆశిష్ గాంధీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ దొరల నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని అజయ్ సామ్రాట్ ఈ మూవీని తెరెక్కించారు. బాహుబలి మూవీకి అజయ్ సామ్రాట్‌నే రైటర్‌గా వ్యవహరించడం విశేషం. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే జూలై 7న థియేటర్లలో విడుదలైన రుద్రంగి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రుద్రంగి స్ట్రీమింగ్ అవుతోంది.🌟🎉