యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “రూల్స్ రంజన్” .
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “రూల్స్ రంజన్”. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మంచి బజ్ ని అందుకున్న ఈ చిత్రం రిలీజ్ ని కూడా ఆ ట్రైలర్ తోనే అనౌన్స్ చేశారు. ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ డేట్ పై మరో అప్డేట్ అందించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 28 నుంచి తప్పించి వచ్చే అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ఖరారు చేశారు. ఇక ఈ చిత్రానికి అమ్రీష్ సంగీతం అందించగా స్టార్ లైట్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఏ ఎం రత్నం సమర్పణలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.🎥🎞️