ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా రామ్ చరణ్ పిఠాపురం వెళ్లగా, అదే సమయానికి అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌కి సపోర్ట్ చేయడం మెగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. బన్నీ తన ఫ్రెండ్‌కి మద్దతు ఇవ్వడానికి వచ్చానన్నప్పటికీ, పవన్ కోసం పిఠాపురం ఎందుకు వెళ్లలేదని మెగా ఫ్యాన్స్ ప్రశ్నించారు.
తాజాగా పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ మెగా ఫ్యామిలీ తరఫున అందరూ హాజరయ్యారు, కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. ఈ కార్యక్రమం సమయంలో సాయి ధరమ్ తేజ్ బన్నీని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం మరోసారి వివాదాన్ని ముదిరించింది. సాయి తేజ్ అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేయడం మెగా ఫ్యాన్స్ vs అల్లు ఫ్యాన్స్ వార్‌కు దారితీసింది.